Advertisement

  • ఒక్క పోస్ట్‌తో అంద‌రినీ ఆలోచించేలా చేస్తున్న బెంగ‌ళూరు పోలీసులు!

ఒక్క పోస్ట్‌తో అంద‌రినీ ఆలోచించేలా చేస్తున్న బెంగ‌ళూరు పోలీసులు!

By: chandrasekar Tue, 11 Aug 2020 09:30 AM

ఒక్క పోస్ట్‌తో అంద‌రినీ ఆలోచించేలా చేస్తున్న బెంగ‌ళూరు పోలీసులు!


కరోనావైరస్ కేసులు భారతదేశంలో ఇప్పటివరకు 22 లక్షలకు పైగా నమోదయ్యాయి. ఆగస్టు 10 నాటికి మరణాల సంఖ్య కూడా 44,386 కు పెరిగింది. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ మధ్య కేసుల సంఖ్య పెరిగింది.

మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి మైన్‌ హాట్‌స్పాట్లలో కేసులు తగ్గుతున్నాయి. కేసులు పెర‌గ‌కుండా ఉండేందుకు బెంగ‌ళూరు పోలీసులు స్మార్ట్ ప‌నుల‌తో అవ‌గాహ‌న పెంచుతున్నారు. ఒక్క పోస్ట్‌తో అంద‌రినీ ఆలోచించేలా చేస్తున్నారు.

'ఘోరమైన కరోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి' అనే శీర్షిక‌ను జోడించారు. ఈ పోస్ట్‌లో పాచిక‌లు ఉన్నాయి. వీటికి అన్నివైపులా క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి అనుస‌రించాల్సిన ముందు జాగ్ర‌త్తలు వివ‌రంగా రాసి ఉంది. 'సామాజిక దూరం పాటించాలి. ఆరుబ‌య‌ట అడుగు పెడితే ఫేస్‌మాస్క్ ధ‌రించాలి. శానిటైజ‌ర్ అప్లై చేస్తూ ఉండ‌డం గుర్తుంచుకోవాలి'. ఈ ఆట గెలవడం స్మార్ట్ వ్యూహం అని పోలీసులు అంటున్నారు.

Tags :
|
|

Advertisement