Advertisement

  • ఐసిస్ ఉగ్రవాదులకు వైద్య సలహాలు ఇచ్చిన బెంగళూరు డాక్టర్

ఐసిస్ ఉగ్రవాదులకు వైద్య సలహాలు ఇచ్చిన బెంగళూరు డాక్టర్

By: chandrasekar Wed, 19 Aug 2020 09:43 AM

ఐసిస్ ఉగ్రవాదులకు వైద్య సలహాలు ఇచ్చిన బెంగళూరు డాక్టర్


ఐసిస్ ఉగ్రవాదులకు వైద్య సలహాలు ఇచ్చిన బెంగళూరు చెందిన డాక్టర్ అబ్దుల్‌ రహమాన్ అరెస్ట్ చేయబడ్డాడు. వైద్యుడిగా పనిచేస్తున్న ఓ యువకుడు ఆ సేవలను ఉగ్రవాదుల కోసం వినియోగిస్తున్నాడు. అందుకోసం ఏకంగా ఓ మొబైల్ యాప్‌నే రూపొందించాడు. దాని ద్వారా ఐసిస్ ఉగ్రవాదులకు వైద్య సలహాలు అందేలా ఏర్పాటు చేశాడు. అతని ఆచూకీ మరియు వివరాలు గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు పక్కా సమాచారంతో ఆ యువ వైద్యుడిని బెంగళూరులో అరెస్టు చేసి విచారణచేస్తున్నారు. వైద్య సలహాలు ఇచ్చిన బెంగళూరుకు చెందిన అబ్దుల్‌ రహమాన్‌ (28) రామయ్య వైద్య కళశాలకు చెందిన కాలేజీలో ఆప్తమాలజీ విభాగంలో జూనియర్‌ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.

యుద్ధంలో గాయపడిన ఐసిస్ ఉగ్రవాదులకు వైద్య సాయం చేస్తున్నాడు. ఈ మెడికల్ యాప్‌ మాత్రమే కాకుండా ఆయుధాల సమాచారానికి సంబంధించిన వివరాలతో మరో యూప్‌ను కూడా రెహమాన్ రూపొందిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. రెహమాన్‌ 2014లో సిరియాలోని ఐసిస్ మెడికల్ క్యాంప్‌ను సందర్శించి, అక్కడే 10 రోజుల ఉండి ప్రత్యేక శిక్షణ పొందినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చి ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.

అతడు విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అతడిని ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల కిందట పుణేలో ఐసిస్‌తో సంబంధాలు కలిగిన కొంత మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా రెహమాన్‌ ఆచూకీ తెలిపింది. అతడిపై నిఘా ఉంచిన ఎన్‌ఐఏ మంగళవారం అతడిని అరెస్టు చేసింది. రెహమాన్ నుంచి డిజిటల్‌ సామగ్రి, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘ విద్రోహ కార్యకలాపాలకు పట్టుబడేవారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేసారు.

Tags :
|
|

Advertisement