Advertisement

  • నేను రాజకీయాల్లో లేను ..నన్ను అందులోకి లాగొద్దు ...బండ్ల గణేష్

నేను రాజకీయాల్లో లేను ..నన్ను అందులోకి లాగొద్దు ...బండ్ల గణేష్

By: Sankar Sun, 29 Nov 2020 7:46 PM

నేను రాజకీయాల్లో లేను ..నన్ను అందులోకి లాగొద్దు ...బండ్ల గణేష్


సినీ నిర్మాత బండ్ల గణేష్ 2019 ఎన్నికల ముందు వరకు రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

అప్పటినుండి ఆయన కనీసం అటువైపు చూడను కూడా చూడలేదు. కానీ తాజాగా తెలంగాణలో జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బండ్ల పేరు తీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్‌.. ఇప్పుడు బండి సంజయ్‌ కామెడీ షో చేస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు.

అయితే కవిత వ్యాఖ్యల పై ట్విట్టర్ వేదికగా బండ్ల స్పందించారు. తన ట్విట్టర్ లో బండ్ల గణేశ్‌ '' నేను జోకర్ ను కాదు. ఫైటర్ని.. కానీ నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను. నన్ను అందులోకి లాగొద్దు'' అని ట్వీట్ చేశారు. దాంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Tags :
|
|

Advertisement