Advertisement

  • పవన్ కళ్యాణ్‌ను ఎవరైనా ఏమన్నా అంటే సహించనన్న బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్‌ను ఎవరైనా ఏమన్నా అంటే సహించనన్న బండ్ల గణేష్

By: chandrasekar Wed, 02 Dec 2020 09:55 AM

పవన్ కళ్యాణ్‌ను ఎవరైనా ఏమన్నా అంటే సహించనన్న బండ్ల గణేష్


జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా పవన్ పై ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలకు బండ్ల గణేష్ స్పందించాడు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి పవన్ కళ్యాణ్‌పై తనకు ఉన్న ప్రేమ, అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను ఎవరైనా ఏమన్నా అంటే సహించనని అయన అన్నారు. అదికూడా ఈ వ్యాఖ్యలు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నట్టు మొదట ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తరవాత పోటీ నుంచి తప్పుకుని బీజేపీకి మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ నిర్ణయంపై ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌ను రంగులు మార్చే ఊసరవెల్లితో పోల్చారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. నువ్వో కుసంస్కారివి అంటూ ప్రకాష్‌ రాజ్‌పై మండిపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ కూడా ప్రకాష్ రాజ్‌పై భగ్గుమన్నారు. వరుస ట్వీట్లతో ప్రకాష్ రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాట్లాడటం ధర్మం కాదని, రాజకీయాలు మాట్లాడకూడదని తాను ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఇంత వరకు స్పందించలేదని బండ్ల గణేష్ తన ఆవేదనను తెలిపారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు మరియు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీ ఆయన నిబద్ధత నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి. రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు. కానీ, వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం అని పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని బండ్ల మరోసారి చాటుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు, ఎంతో మంది సాంకేతిక నిపుణులను, ఎంతో మంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత తన దైవం పవన్ కళ్యాణ్‌ది అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. బండ్ల గణేష్ తెలుగులో చేసిన ఈ ట్వీట్లలో ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించకపోయినా ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. అంటే, ఈ వ్యాఖ్యలు ఆయనపై చేసినట్టే. మరి, బండ్ల గణేష్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తారో లేదో ఇక వేచి చూడాలి. పవన్ పై నున్న తన అభిమానాన్ని ఈ విధంగా అయన వెళ్లగక్కారు.


Tags :

Advertisement