Advertisement

పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పిన బండి సంజయ్

By: Sankar Sun, 06 Dec 2020 8:52 PM

పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పిన బండి సంజయ్


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా, బీజేపీ అనూహ్యంగా పుంజుకుని భారీగా సీట్లు సాధించింది..గెలుపు సంబరాల అనంతరం బండి సంజయ్ పలువురికి అభినందనలు తెలిపారు.

ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ గెలుపునకు పోరాడిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ విజయం బీజేపీ శ్రేణుల కష్టార్జితం అని తేల్చి చెప్పేశారు.

గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో గాని, తన ట్వీట్‌లో గాని పవన్ ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో బండి సంజయ్ తీరుపై జనసైనికులు రగిలిపోయారు. అప్పుడే విజయగర్వం వచ్చిందా అంటూ దుయ్యబట్టారు. కానీ, తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసేలా బండి సంజయ్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచి, బీజేపీని విజయతీరాలకు చేర్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు జన సైన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ మద్దతు మా అభ్యర్థులకు గొప్ప స్థైర్యాన్ని ఇచ్చింది. మోడీ గారి నాయకత్వానికి, మాకు మీరు అందిస్తున్న సహకారం వెలగట్టలేనిది.’’ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.


Tags :
|
|

Advertisement