Advertisement

  • తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో పాల్గొన్న 2550 మంది విదేశీయులపై నిషేధం

తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో పాల్గొన్న 2550 మంది విదేశీయులపై నిషేధం

By: chandrasekar Sat, 06 June 2020 3:03 PM

తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో పాల్గొన్న 2550 మంది విదేశీయులపై నిషేధం


తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో పాల్గొన్న 2550 మంది విదేశీయులను కేంద్రప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టింది. పదేండ్లపాటు భారత్‌లోకి రాకుండా వారిపై నిషేధం విధించింది. దేశంలో తబ్లిగీ జమాత్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా వారిని బ్లాక్‌లిస్టులో ఉంచింది. ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాతే ప్రార్థనల్లో విదేశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వీసా నిబంధనలకు విరుద్ధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు నియంత్రణలో ఉన్న సయమంలో తబ్లిగీ జమాత్‌ ఉదంతం బయటపడింది. ఈ ప్రార్థనల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. అయితే తబ్లిగీ ప్రార్థనల్లో పాల్గొన్న విదేశీయులకు కరోనా లక్షణాలు ఉండటం, ఈ ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో దేశంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగాయి.

దేశంలో కరోనా కేసులు అధికమవడానికి మర్కజ్‌లోని తబ్లిగీ జమాతే కారణమని తెలంగాణ పోలీసులు మొదటి సారిగా గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి తబ్లిగీ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు.

Tags :
|

Advertisement