Advertisement

  • మహారాష్ట్రలోని పుణెలో పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన

మహారాష్ట్రలోని పుణెలో పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన

By: chandrasekar Wed, 01 July 2020 10:57 AM

 మహారాష్ట్రలోని పుణెలో పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన


దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్‌ శ్రేణులు మహారాష్ట్రలోని పుణెలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు బాలాసాహెబ్‌ థోరట్‌ మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

ఇంధన ధరల పెంపుతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఇప్పటికే కరోనాతో వారు సతమవుతుండగా ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి అదనపు భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్‌ జోషి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు తక్కువగా ఉన్నా కేంద్రం మాత్రం ధరలు పెంచుతోందని ఆక్షేపించారు.

అంతర్జాయతీ మార్కెట్‌లో ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ధరలను నిర్దేశించాలని డిమాండ్‌ చేశారు. కేవలం 40 రూపాయలకు విక్రయించాల్సిన పెట్రోల్‌ను రూ.90కి విక్రయిస్తున్నారని వెంటనే ధరలను తగ్గించాలని కోరారు. పుణెలో పెట్రోల్‌ ధర రూ.0.17పైసల పెంపుతో లీటర్‌ ధర 87.27కు, డీజిల్‌ ధర రూ. 77.71కు పెరిగింది.

Tags :
|
|

Advertisement