Advertisement

ఏ సారి బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం లేదు ..

By: Sankar Fri, 24 July 2020 07:20 AM

ఏ సారి బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం లేదు ..



తెలంగాణ రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ గణపతి ఉత్సవాల కోసం పలు నిర్ణయాలను తీసుకుంది.

ఈ ఏడాది గణపతి ఉత్సవాల్లో భాగంగా కేవలం ఆరు అడుగుల వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఉత్సవ కమిటీ పేర్కొంది. అదే విధంగా అత్యంత ఆసక్తికరంగా నిర్వహించే వినాయకుడి లడ్డూ వేలంపాట ఏడాది నిర్వహించబోమని తెలిపింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల దర్శనం నిలిపివేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బాలాపూర్ లడ్డు వేలంపాట జరుగుతుంది ..దీనికి రెండు రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు ..అయితే కరోనా కారణముగా కేవలం కమిటీ వారే ఈ సారీ వినాయక ఉత్సవాలలో పాల్గొంటున్నారు అందువలన ఈ ఏడాది వేలం పాటను రద్దు చేసారు ..

Tags :
|
|
|

Advertisement