Advertisement

  • కొవిడ్-19 వ్యాప్తి కారణంగా అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్‌ జూలై 1 కి వాయిదా

కొవిడ్-19 వ్యాప్తి కారణంగా అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్‌ జూలై 1 కి వాయిదా

By: chandrasekar Tue, 30 June 2020 7:40 PM

కొవిడ్-19 వ్యాప్తి కారణంగా అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్‌ జూలై 1 కి వాయిదా


మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన సంగతి తెలిసిందే. టెక్కలిలోని ఆయన ఇట్లో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అచ్చెన్నకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. పైల్స్ ఆపరేషన్ చేసుకున్న ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. తాజాగా అచ్చెన్నాయుడుకు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది.

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల కార్యకలాపాలను ఈ నెల 30 వరకు నిలిపివేశారు. దాంతో టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కోర్టు పనులు నిలిచిపోయాయని, అందుకే జూలై 1న బెయిల్ పిటిషన్ విచారిస్తామని వెల్లడించింది.

అచ్చెన్నాయుడికి ఇటీవలే మూడ్రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. మరోవైపు ప్రస్తుతం అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నను గుంటూరు జీజీహెచ్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అచ్చెన్ననను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Tags :
|

Advertisement