Advertisement

  • గణపతి ఉత్సవాలు నిరాడంబరంగా జరుపుకోవాలి ..భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ

గణపతి ఉత్సవాలు నిరాడంబరంగా జరుపుకోవాలి ..భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ

By: Sankar Mon, 27 July 2020 8:36 PM

గణపతి ఉత్సవాలు నిరాడంబరంగా జరుపుకోవాలి ..భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ



కరోనా నేపథ్యంలో ఈ ఏడాది వినాయక ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకోవాలని భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు విజ్ఞప్తి చేశారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనల మేరకు భక్తులు నడుచుకోవాలని కోరారు. కరోనా కారణంగా ఉగాది,శ్రీరామనవమి,బోనాలు పండగలు కూడా చేసుకోలేకపోయామన్నారు.

సెప్టెంబర్‌ 1న సామూహిక నిమజ్జనాలు చేయడం వీలు కాదని.. సామూహిక దూరం పాటిస్తూ తక్కువ మందితో నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద నలుగురు,ఐదుగురితో సామాజిక దూరం పాటించి పూజలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2021 ఏడాది నాటికి పరిస్థితులు చక్కబడితే అప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పండగ చేసుకుందామని తెలిపారు.

‘‘గణేష్ విగ్రహాల ఎత్తుల విషయంలో పోటీ పడొద్దు. టబ్బులు, బకెట్లలో నిమజ్జనం కరెక్ట్ కాదు. చెరువు, నది, బావి, సముద్రాల్లో సహజ సిద్ధంగా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి. మండపాల విషయంలో పోలీసుల అనుమతులు అవసరం లేదని, ఇంటిమేషన్ తప్పకుండా ఇవ్వాలి. మండపాల్లో శానిటైజేషన్ తప్పనిసరిగా చేయాలని’’ భగవత్‌రావు పేర్కొన్నారు

Tags :
|
|

Advertisement