Advertisement

భారత్ లో పబ్ జి లవర్స్ కు బ్యాడ్ న్యూస్

By: Sankar Tue, 01 Dec 2020 9:36 PM

భారత్ లో పబ్ జి లవర్స్ కు బ్యాడ్ న్యూస్


పబ్‌జీ అభిమానులకు చేదువార్త. పబ్‌జీ తిరిగి సేవలను భారత్ లో తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పట్టేలాగా ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పబ్‌జీ కార్పొరేషన్ కి ఇంకా పూర్తీ స్థాయి అనుమతులు రావాల్సి ఉంది.

కేంద్ర ప్రభుతం నిషేధం విధించిన తర్వాత తిరిగి భారత్ లోకి "పబ్‌జీ మొబైల్ ఇండియా" పేరుతో గ్లోబల్ వెర్షన్ కి భిన్నంగా రావాలని ప్రయత్నిస్తుంది. దీంతో పబ్‌జీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. భారత్ దేశంలో పబ్‌జీ గేమ్ ని పూర్తీ స్థాయిలో తీసుకొచ్చేందుకు, అన్ని విధానాలను పూర్తీ చేసి ఈ నెల మొదటి వారంలో తీసుకురావాలని భావించింది.

కానీ, దీనికి కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి పూర్తీ స్థాయి అనుమతులు మాత్రం రాలేదు. గతంలో నిషేధింపబడ్డ సంస్థలు తమ వ్యాపార లావాదేవీల కోసం మన దేశంలో ఒక కొత్త సంస్థను ఫ్లోట్ చేసి తీసుకురావడం సరైన విధానం కాదని కేంద్రం తేల్చి చెప్పింది.

Tags :
|
|
|

Advertisement