Advertisement

గోల్డ్ లోన్ తీసుకున్న వారికి బాడ్ న్యూస్...!

By: chandrasekar Thu, 10 Sept 2020 2:56 PM

గోల్డ్ లోన్ తీసుకున్న వారికి బాడ్ న్యూస్...!


కరోనా వైరస్ కాలంలో గోల్డ్ లోన్ తీసుకున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు ఇలా చాలా మంది వారి ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులో బంగారం పెట్టి లోన్ తీసుకొని ఉంటారు. ఇటీవల RBI గోల్డ్ లోన్స్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌లో తనఖా పెట్టే బంగారం విలువలో 90 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. గతంలో గోల్డ్ లోన్‌పై 75 శాతం విలువ వరకు మాత్రమే రుణం లభించేంది. అంటే ఇప్పుడు మీ బంగారానికి ఇప్పుడు అధిక విలువ లభిస్తోంది. ఎక్కువ డబ్బులు చేతికి వస్తున్నాయి. అంతేకాకుండా బంగారం ధర ఆగస్ట్ నెలలో ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,300కు ఎగసింది. అంటే మీ బంగారానికి ఎక్కువ రుణ మొత్తం కాకుండా ధరలు కూడా పెరిగిపోవడంతో మరింత ఎక్కువ డబ్బులు మీకు రుణం కింద లభించి ఉంటాయి. మీరు ఆగస్ట్ నెలలో లోన్ తీసుకొని ఉంటే రెండు ప్రయోజనాలు పొంది ఉండవచ్చు.

కానీ, ఇప్పుడు బంగారం ధర రూ.51,000కు పడిపోయింది. అంటే గరిష్ట స్థాయి నుంచి చూస్తే బంగారం ధర దాదాపు రూ.5,000 పతనమైంది. దీనివల్ల గోల్డ్ లోన్ తీసుకున్న వారికి ఒక బ్యాడ్ న్యూస్. బంగారం ధర తగ్గితే గోల్డ్ లోన్ తీసుకునే వారికి లభించే రుణ మొత్తం కూడా తగ్గిపోతుంది. అదే ఇప్పటికే మీరు బంగారంపై రుణం తీసుకొని ఉంటే.. బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి పడిపోవడంతో బ్యాంకులు మిమ్మల్ని కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరే అవకాశం కూడా ఉంది. బంగారం ధర మరింత తగ్గితే బ్యాంకులు మిమ్మల్ని డబ్బులు కట్టమని కోరే ఛాన్స్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంత మంది అయితే బంగారం ధర పెరిగిపోవడంతో తీసుకున్న గోల్డ్ లోన్‌పై మళ్లీ టాపప్ లోన్ తీసుకొని ఉండొచ్చు. వీరిపై కూడా ప్రభావం పడే అవకాశముంది. బ్యాంకులు గోల్డ్ లోన్ ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్లలో ఒక రూల్‌ను చేర్చి ఉంటాయి. దీని ప్రకారం లోన్ టూ వ్యాల్యూ రేషియో (ఎల్‌టీవీ) తగ్గినప్పుడు బ్యాంకులు మరింత బంగారాన్ని లేదంటే కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కస్టమర్లను కొరొచ్చు. సాధారణంగా బ్యాంకులు నెల రోజుల బంగారం ధర సగటు ప్రాతిపదికన ఎల్‌టీవీని నిర్ణయిస్తాయి. గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అన్ని రూల్స్ తెలుసుకోండి.

Tags :
|
|

Advertisement