Advertisement

  • బాబ్రీ మసీద్ కూల్చివేత తీర్పుతో బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్

బాబ్రీ మసీద్ కూల్చివేత తీర్పుతో బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్

By: Sankar Thu, 01 Oct 2020 07:51 AM

బాబ్రీ మసీద్ కూల్చివేత తీర్పుతో బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్


బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు, హిందూత్వవాదులు నిర్దోషులుగా బయటపడడం కాషాయం కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

వివాదాస్పద కట్టడాన్ని కుట్ర ప్రకారం కూల్చలేదని, అప్పటికప్పుడు జరిగిపోయిన సంఘటన అంటూ పదే పదే చెబుతూ వస్తున్న బీజేపీ నాయకులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నారు. బిహార్‌ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాబ్రీ తీర్పుతో మరో భావోద్వేగ అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశం బీజేపీకి వచ్చింది.

కమలనాథులు రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయంగా తమకు బాగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి.

కోర్టు తీర్పుని జై శ్రీరామ్‌ నినాదాలతో స్వాగతించామని అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ వ్యాఖ్యానించారు. అటు రాముడికి గుడి కడుతున్నారన్న పేరు ప్రతిష్టలు రావడంతో పాటు, మసీదు కూల్చివేత అప్రతిష్ట కూడా పార్టీకి అంటకుండా తీర్పు వెలువడడం బీజేపీలో మంచి ఉత్సాహాన్ని నింపింది. మొత్తమ్మీద రామజన్మభూమి ఉద్యమం పార్టీకి అన్ని రకాలుగా కలిసొచ్చిందనే విశ్లేషణలు వినబడుతున్నాయి.

Tags :

Advertisement