Advertisement

  • బాబ్రీ మసీద్ కూల్చివేత తుది తీర్పు వెల్లడి..దిగ్గజ నేత అద్వానీకి ఊరట

బాబ్రీ మసీద్ కూల్చివేత తుది తీర్పు వెల్లడి..దిగ్గజ నేత అద్వానీకి ఊరట

By: Sankar Wed, 30 Sept 2020 3:07 PM

బాబ్రీ మసీద్ కూల్చివేత తుది తీర్పు వెల్లడి..దిగ్గజ నేత అద్వానీకి ఊరట


ఎంతో కాలంగా ఉత్కంఠ రేపిన బాబ్రీ మసీద్ కూల్చివేత తీర్పు ఎట్టకేలకు వచ్చింది..1992, డిసెంబర్ 6 వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించిన కీలక తీర్పును ఈరోజు లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న 49 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈకేసును కోర్టు కొట్టివేసింది.

49 మందిలో ఇప్పటికే 17 మంది మరణించారు. మిగిలిన 32 మంది నిందితుల్లో 8 మంది బీజేపీ నేతలు కూడా ఉన్నారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్, సాక్షి మహారాజ్, లల్లూ సింగ్, బిబి శరన్ సింగ్ లకు ఈ కేసు నుంచి ఊరట లభించింది. 2001లోనే ఈ కేసు నుంచి పలువురి పేర్లను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తొలగించినా, 2017 లో సుప్రీం కోర్టు...తొలగించిన 17 మంది పేర్లను తిరిగి కేసులో చేర్చాలని పేర్కొన్నది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 17 మంది పేర్లను తిరిగి కేసులో చేర్చారు.

బాబ్రీ కేసులో అభియోగాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఎల్కే అధ్వానిని రాజకీయంగా పక్కన పెట్టారు. కాగా, ఇప్పుడు బాబ్రీ కేసులో క్లీన్ చిట్ లభించడంతో అద్వానీకి రాజకీయంగా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags :
|

Advertisement