Advertisement

  • ఏనుగు ఎక్కి మరీ యోగా చేసి చూపించే ప్రయత్నంలో కింద పడిన బాబా రాందేవ్‌

ఏనుగు ఎక్కి మరీ యోగా చేసి చూపించే ప్రయత్నంలో కింద పడిన బాబా రాందేవ్‌

By: chandrasekar Wed, 14 Oct 2020 11:31 AM

ఏనుగు ఎక్కి మరీ యోగా చేసి చూపించే ప్రయత్నంలో కింద పడిన బాబా రాందేవ్‌


యోగాలో సిద్ధహస్తుడిగా పేరున్న బాబా రాందేవ్ తాజాగా ఓ ఏనుగు ఎక్కి మరీ యోగా చేసి చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఏనుగు ఒక్క అడుగు కదలడంతో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు.

సోమవారం ఉత్తర్ ప్రదేశ్ మధురకు సమీపంలోని మహావన్‌‌లో ఉన్న రామ్ నరేతి ఆశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనలో అదృష్టవశాత్తు బాబా రాందేవ్‌కి ఎటువంటి గాయాలు కాలేదు. కింద పడిన వెంటనే క్షణం ఆలస్యం లేకుండా లేచి నిలబడి బట్టలకు అంటిన దుమ్మును దులుపుకుంటూ, నవ్వుకుంటూ ముందుకు సాగిపోయాడు. బాబా రాందేవ్ ఏనుగుపై ప్రాణాయమ యోగా చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

Tags :
|

Advertisement