Advertisement

టీఎస్‌ వెథర్‌ మొబైల్‌యాప్‌ ఆవిష్కరణ

By: Sankar Fri, 19 June 2020 7:47 PM

టీఎస్‌ వెథర్‌ మొబైల్‌యాప్‌ ఆవిష్కరణ





రాష్ట్రంలో వాతావరణ సమాచారం, వర్ష సూచన వంటి సమగ్ర వివరాలతో కూడిన మొబైల్‌ యాప్‌ను సామాన్యులకు సైతం అరచేతిలోకి అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని అధికార నివాసంలో టీఎస్‌ వెథర్‌ మొబైల్‌యాప్‌ పోస్టర్స్‌ను ఆయన ఆవిష్కరించారు.

తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (టీఎస్‌డిపీఎస్‌) ఈ యాప్‌ను రూపొందించింది. ఈ సందర్బంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులు, ప్రజలకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందన్నారు.వాతావరణ పరిస్థితులు, సూచనలతో రైతులు వ్యవసాయ పనులను, ప్రజలు ప్రయాణాలను కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఏ ప్రాంతం వివరాలైనా అరచేతిలో క్షణాల్లో అందించే విధంగా ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్టు ఆయన వెల్లడించారు. మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికీ ఈ యాప్‌ఎంతో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్లానింగ్‌ డైరెక్టర్‌ షేక్‌ మీరా, అర్ధగణాంక శాఖ డైరెక్టర్‌, టీఎస్‌ డీపీఎస్‌ ఇన్‌చార్జి సీఈవో దయానంద్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Tags :

Advertisement