Advertisement

  • కారు టైరులో తల వెంట్రుకలు చుట్టుకొని యువతి మృతి

కారు టైరులో తల వెంట్రుకలు చుట్టుకొని యువతి మృతి

By: Sankar Thu, 08 Oct 2020 4:28 PM

కారు టైరులో తల వెంట్రుకలు చుట్టుకొని యువతి మృతి


హైదరాబాద్ శివారులో దారుణం చోటుచేసుకుంది. గోకార్టింగ్ ప్లే జోన్ లో తీవ్రగాయాలైన ఓ యువతి మృతి చెందింది. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని శ్రీ వర్షిని ఎంజాయ్ చేయడానికి తన స్నేహితులతో కలిసి వచ్చింది. ప్లే జోన్ లో ఉన్న కారు లో షికారు చేద్దామనుకున్నారు.. కారు లో షికారు చేస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీ వర్షిణికి తీవ్ర గాయాల య్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అమ్మాయి వెంట్రుకలు కారు చక్రంలో చుట్టుకపోవడంతో హెల్మెట్ ఒక్కసారిగా వెళ్ళిపోయింది. దీంతో అమ్మాయి కింద పడటంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని చూసిన స్నేహితులు వెంటనే అమ్మాయిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి గో కాటింగ్ నిర్వాహకులపైనా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నామని మీర్పేట్ పోలీసులు వెల్లడించారు.

గో కార్టింగ్ చేసేటప్పుడు తగిన విధంగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గో కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు చనిపోయిందంటూ శ్రీ వర్షిని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

Tags :
|

Advertisement