Advertisement

  • రామ మందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలే మారిపోతాయి ..ప్రధాని నరేంద్ర మోడీ

రామ మందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలే మారిపోతాయి ..ప్రధాని నరేంద్ర మోడీ

By: Sankar Wed, 05 Aug 2020 2:55 PM

రామ మందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలే మారిపోతాయి ..ప్రధాని నరేంద్ర మోడీ



భారతీయ సంస్కృతికి రాముడు ప్రతీక. మందిర నిర్మాణంతో చరిత్ర సృష్టించడమే కాక.. చరిత్ర పునరావృతమవుతోంది. నదిని దాటడానికి రాముడికి గుహుడు సాయం చేశాడు.. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి కృష్ణుడికి పిల్లలు సాయం చేశారు. అలానే అందరి ప్రయత్నం, కృషితో మందిర నిర్మాణం పూర్తవుతుంది. మందిర నిర్మాణంతో అయోధ్య రూపు రేఖలు మారిపోతాయి.

దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. దాంతో ఆర్థికంగా కూడా అభివృద్ధి జరుగుతుంది. మానవుడు రాముడిని విశ్వసించినప్పుడల్లా పురోగతి జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. ఆ మార్గం నుంచి తప్పుకున్నప్పుడల్లా.. విధ్వంసం తలుపులు తెరవబడ్డాయి. మనం అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలి. అందరి మద్దతు, నమ్మకంతో ప్రతి ఒక్కరి అభివృద్ధిని ఆకాంక్షించాలి’ అని మోదీ కోరారు.

అయోధ్యలో నిర్మించబోయే మందిరం శ్రీరాముని పేరు వలే.. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది సమస్త మానవాళిని ప్రేరేపిస్తుందని నా నమ్మకం. రాముడు అందరి వాడు.. ప్రతి ఒక్కరిలో ఉన్నాడు’ అన్నారు మోదీ. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం శిలాఫలాకాన్ని మోదీ ఆవిష్కరించారు. రామ మందిర నిర్మాణ చిహ్నంగా పోస్ట్‌ల స్టాంప్‌ను విడుదల చేవారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :
|
|

Advertisement