Advertisement

  • హేమంత్ హత్య కేసులో అవంతి సోదరుడు అశిష్‌రెడ్డి పేరు తెరపైకి

హేమంత్ హత్య కేసులో అవంతి సోదరుడు అశిష్‌రెడ్డి పేరు తెరపైకి

By: chandrasekar Mon, 28 Sept 2020 3:58 PM

హేమంత్ హత్య కేసులో అవంతి సోదరుడు అశిష్‌రెడ్డి పేరు తెరపైకి


హేమంత్ హత్య కేసులో అవంతి సోదరుడు అశిష్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పోలీసులు కేసును వేగవంతం చేయడంతో మరిన్ని వివరాలు బయటపడుతున్నాయి. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుని హత్యకు గురైన హేమంత్ కేసుకు సంబంధించి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అన్నిరకాల ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరికొందరు లొంగిపోయారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అయితే తాజాగా ఈ కేసులో హేమంత్ భార్య అవంతి సోదరుడు అశిష్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన అవంతి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హేమంత్ మరియు నేను ప్రేమించుకున్న విషయం ఏడు నెలల క్రితం మా ఇంట్లో తెలిసింది. అప్పటి నుంచి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. సెల్‌ఫోన్ కూడా తీసేసుకుని నేను బయటి వ్యక్తులతో కలవకుండా, మాట్లాడకుండా చేశారు.

నేను ఇంటి నుండి బయటకు వేళ్ళ కుండా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నా మీద నిఘా ఉంచారు అందువల్ల హేమంత్ తో మాట్లాడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. హేమంత్‌తో మాట్లాడినప్పుడు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. జూన్‌లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. తొలుత జూన్ 6న పెళ్లి చేసుకుందామని అనుకున్నా ఆ రోజు నా తల్లిందండ్రుల పెళ్లి రోజు కావడంతో వారిని బాధపెట్టడం ఇష్టంలేక వాయిదా వేసుకున్నాం. ఇక పెళ్లికి ముందు రోజు రాత్రి హేమంత్ మా ఇంటి సమీపంలోకి వచ్చాడు. అప్పుడు కరెంట్ పోయిన సమయంలో నేనే తేలికగా బయటకు వచ్చేశాను. ఇక, పెళ్లి చేసుకున్నాక పోలీసులను ఆశ్రయించాం. దీంతో సీపీ సజ్జనార్ ఇరువర్గాలను పిలిపించి మాట్లాడాలని పోలీసులకు సూచించారు. అయితే కౌన్సిలింగ్ సమయంలో నా తల్లిదండ్రులు మమల్ని బూతులు తిట్టారని ఇద్దరు పోలీసులు కూడా వారిగా మద్దుగా ఉన్నారు. ఆ తర్వాత నా ఆస్తులను నా తల్లిదండ్రుల పేరిట రాసేశాను.

పెళ్ళైన తరువాత హేమంత్ తో బాటు నేను అత్తారింట్లో సంతోషంగానే ఉన్నాను. నా తల్లిదండ్రులు దీనిని జీర్ణించుకోకపోవడంతో మాకు బెదిరింపులు మాత్రం ఆగలేదు. ఫోన్లలో కూడా బెదిరింపులకు పాల్పడుతుండేవారు. నాకు ప్రాణహాని ఉందని జూన్ 15 పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు సకాలంలో స్పందించలేదు. స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదు. ఈ ఘోరానికి పాల్పడ్డ నిందితుకు కఠిన శిక్ష పడేలా పోలీసులు చూడాలి అని అవంతి కోరారు. తన భర్త హేమంత్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పెద్ద అభిమాని అని ఈ కేసులో తమకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి సహాయం చేయాలని కోరింది. మరోవైపు హేమంత్ గొంతుకు తాడు బిగించడం వల్లే అతడు మరణించినట్టు పోస్టుమార్టమ్ ప్రాథమిక నివేదికలో డాక్టర్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. తనకు జరిగిన అన్యాయానికి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags :
|
|

Advertisement