Advertisement

  • ఉచితంగా కరెంట్ కోసం ఆటమ్ సోలార్ రూఫ్ ప్రొడక్ట్‌

ఉచితంగా కరెంట్ కోసం ఆటమ్ సోలార్ రూఫ్ ప్రొడక్ట్‌

By: chandrasekar Thu, 17 Sept 2020 12:28 PM

ఉచితంగా కరెంట్ కోసం ఆటమ్ సోలార్ రూఫ్ ప్రొడక్ట్‌


తాజాగా విశాఖ ఇండస్ట్రీస్‌ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రొడక్ట్‌కు 20 ఏళ్ల పేటెంట్ దక్కించుకుంది. ఆటమ్ అనేది సోలార్ రూఫ్. దీన్ని ఇంటి పైనా ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కంపెనీ ఈ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్‌ను పాలీ లేదా మోనో క్రిస్టలిన్ సోలార్ సెల్స్‌, సిమెంట్ బోర్డ్స్‌తో తయారు చేసింది. చాలా కాలం మన్నికకు వస్తాయి. గట్టిగా కూడా ఉంటాయి. డైరెక్ట్‌గా ఆ సోలార్ ప్యానెల్‌ను ఇంటి పైకప్పుగా ఉపయోగించొచ్చు. లేదంటే ఇప్పటికే ఇంటి పైకప్పు ఉంటే దానిపై ఏర్పాటు చేసుకోవచ్చు.

ఆటమ్‌కు ప్రతిష్టాత్మక యూఎల్ సర్టిఫికేషన్‌ కూడా ఉంది. బలమైన గాలులను కూడా తట్టుకో గలదు. ఇంకా సాంప్రదాయ సోలార్ టైల్స్ మాదిరి కాకుండా ఆటమ్‌ ఏర్పాటుకు ఎలాంటి ఫౌండేషన్ అవసరం లేదు. నేరు‌గా పనిచేస్తుంది. మిగతా వాటి కన్నా 20 నుంచి 40 శాతం ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎక్కువ సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి అయ్యే ఖర్చును 4 ఏళ్లలో దీని ద్వారానే తీర్చేయవచ్చు. అందువల్ల ఇది ఆకర్షణీయ ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా కనిపిస్తోంది. దీన్ని ఏకంగా 30 ఏళ్ల వరకు ఉపయోగించొచ్చు. అంటే మీరు 25 ఏళ్ల పాటు ఉచితంగానే కరెంట్ పొందొచ్చు. కరెంట్ బిల్లు కట్టాల్సిన పని ఉండదు. తమిళనాడు, మహరాష్ట్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వీటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు.

Tags :
|
|

Advertisement