Advertisement

  • హైదరాబాద్ లో దారుణం ..ఆటో ఎక్కిన యువతిని హతమార్చిన ఆటోడ్రైవర్

హైదరాబాద్ లో దారుణం ..ఆటో ఎక్కిన యువతిని హతమార్చిన ఆటోడ్రైవర్

By: Sankar Thu, 17 Dec 2020 11:54 AM

హైదరాబాద్ లో దారుణం ..ఆటో ఎక్కిన యువతిని హతమార్చిన ఆటోడ్రైవర్


మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు అనేక రక్షణ చట్టాలు చేస్తున్నప్పటికీ మృగాళ్లలో మార్పు మాత్రం రావడం లేదు ..తెలంగాణాలో గత ఏడాది సంచలనం సృష్టించిన దిశ ఘటన తర్వాత చట్టాలు మరింత కఠినతరం చేసినప్పటికీ కూడా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి..

హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ లో ఫిరోజ్ అనే ఆటో డ్రైవర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆటోలో ఎక్కిన యువతిపై అత్యాచార యత్నం చేశాడు. యువతి ప్రతిఘటించడంతో స్క్రూడ్రైవర్ తో యువతిపై దాడి చేసి హత్య చేశాడు. మృతి చెందిన యువతి మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా తగులబెట్టాడు.

మహిళ ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు దుస్తులు తొలగించి, ముఖాన్ని ఇటుకతో ఛిద్రం చేశాడు. దిశ తరహాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చాంద్రాయణ గుట్టకు వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయంలో యువతి ఫాతిమా ఆటో ఎక్కగా ఈ ఘటన జరిగింది. ఇప్పటికే నిందితుడు ఫిరోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

Tags :
|
|

Advertisement