Advertisement

  • సూపర్‌ స్టార్ రజినీకాంత్ పార్టీ కి చిహ్నంగా 'ఆటో'?

సూపర్‌ స్టార్ రజినీకాంత్ పార్టీ కి చిహ్నంగా 'ఆటో'?

By: chandrasekar Wed, 16 Dec 2020 09:12 AM

సూపర్‌ స్టార్ రజినీకాంత్ పార్టీ కి చిహ్నంగా 'ఆటో'?


సూపర్‌ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై సర్వత్రా ఉత్కంఠం నెలకొన్న విషయం తెలిసిందే. ఇందు కోసం రజినీకాంత్ ఈ నెల డిసెంబర్ 31 వ తేదీన తన పార్టీ పేరును ప్రకటించనున్నట్లు తెలిపారు. రానున్న 2021 లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈయన ఈ ఎలక్షన్ లో పోటీచేయనున్నారు. ఇందుకోసం అయన అభిమానులంతా చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు.

కానీ అయన రానున్న ఎలక్షన్ కోసం తమ పార్టీ పేరును మరియు చిహ్నాన్ని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయాల్సి వుంది. ఇందుకోసం తాను స్థాపించబోయే పార్టీ పేరు 'మక్కల్‌ సేవా కచ్చి' గాను మరియు పార్టీ చిహ్నంగా 'ఆటో ' ను కేటాయించినట్లు సమాచారం. కానీ దీనిపై ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.

చాలా కాలంగా రజినీకాంత్ కొత్త పార్టీ పై ప్రకటన కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వివరాలు అందడంతో అయన అభిమానుల మధ్య మరింత వుత్సహాన్ని చూడవచ్చు. రజినీకాంత్ రాజకీయ ప్రవేశంతో ప్రత్యర్థి పార్టీల మధ్య అలజడి మొదలైనట్లు తెలుస్తుంది.

Tags :

Advertisement