Advertisement

  • చంద్రబాబు నివాసానికి నోటీసులు అంటించిన అధికారులు

చంద్రబాబు నివాసానికి నోటీసులు అంటించిన అధికారులు

By: chandrasekar Mon, 28 Sept 2020 11:31 AM

చంద్రబాబు నివాసానికి  నోటీసులు అంటించిన అధికారులు


కృష్ణానది వరద ఉధృతి భారీగా పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి వెంకటపాలెం కరకట్ట లోపల వైపు ఉన్న నిర్మాణాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. మొత్తం 36 నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీచేశారు. అందులో ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇళ్లు కూడా ఉంది. చంద్రబాబు ఇంటి ముందు ఉన్న పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌కు నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు అంటించారు. వరదనీరు నదీతీరం వెంబడి నివాస గృహాలను చుట్టుముట్టే అవకాశం ఉందని ఆ నోటీసుల్లో పేర్కొనట్టు సమాచారం. వర్షాల కారణంగా క‌ృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా చేరకుంటుంది. దీంతో అధికారులు నీటిని కిందకు వదలుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో నీటి మట్టం 16.2 అడుగలకి చేరింది. దీంతో దిగువకు భారీ ప్రవాహం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

అధికారులు లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలను తరలిస్తున్నారు. ఇక, గతేడాది కూడా కృష్ణా నదికి వరద పోటెత్తిన సమయంలో చంద్రబాబు ఇంటికి అధికారులు ప్రమాద హెచ్చరిక జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరకట్టపై ఉన్న నివాసాలను పరిశీలించారు. అవన్నీ అక్రమ కట్టడాలనే వాదన తెరమీదకు వచ్చింది. దీంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే టీడీపీ నేతలు మాత్రం ప్రభుత్వం కావాలనే చంద్రబాబు ఇంటితోపాటు రాజధాని గ్రామాల్లోకి వరద నీరు చేరేలా చేసిందని ఆరోపించారు. అమరావతి సురక్షిత ప్రాంతం కాదని నిరూపించడానికి ప్రభుత్వం ఇలా చేసిందని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శించారు.

Tags :
|

Advertisement