Advertisement

  • ఆస్ట్రేలియన్ల నమ్మకాన్ని కోల్పోయిన చైనా ..తాజాగా సర్వేలలో వెల్లడి

ఆస్ట్రేలియన్ల నమ్మకాన్ని కోల్పోయిన చైనా ..తాజాగా సర్వేలలో వెల్లడి

By: Sankar Wed, 24 June 2020 4:00 PM

ఆస్ట్రేలియన్ల నమ్మకాన్ని కోల్పోయిన చైనా ..తాజాగా సర్వేలలో వెల్లడి



కరోనా కారణంగా ప్రపంచ దేశాలు అన్ని చైనా మీద నమ్మకాన్ని కోల్పోయాయి ..కరోనా విషయంలో రెండు నాలుకలా ధోరణిని అవలంబించింది అని ప్రపంచ దేశాలు మండిపడ్డాయి ..అమెరికా అయితే కావాలనే చైనా కరోనా వైరస్ ను సృష్టించింది అని ప్రకటించింది దీనిపై చైనా తీవ్రంగా ఖండించినప్పటికీ ఆస్ట్రేలియా వంటి దేశాలు అమెరికాకు మద్దతు తెలిపాయి ..తాజాగా కరోనా మీద గోప్యత పాటించింది అన్న ఆరోపణల కారణంగా ఆస్ట్రేలియన్లు చైనా మీద తమ విశ్వాసాన్ని తగ్గించారు ..తాజాగా నిర్వహించిన సర్వేలో ఇది బహిర్గతం అయింది ..

గతంలో చైనాపై నమ్మకం ఉందన్న వారు 53 శాతంగా ఉండగా తాజాగా ఈ సంఖ్య 23 శాతానికి చేరుకుంది. చైనాతో ఆర్థిక సంబంధాలు కనిష్టస్థాయికి పరిమితం చేయాలని ఏకంగా 94 శాతం మంది ఆస్ట్రేలియా వాసులు అభిప్రాయపడుతున్నారంటే చైనా ఇమేజీ ఎంతగా డ్యామేజ్ అయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గాల్వాన్ కల్లోలం తరువాత భారతీయులు కూడా ఇటువంటి వైఖరే అవలంబిస్తున్న విషయం తెలిసిందే.

ఇక అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ పాపులారిటీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సర్వేలోని మరో ఆసక్తికర విషయం ఏంటంటే..ఏకంగా 78 శాతం మంది ఆస్ట్రేలియన్లు అమెరికాతో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని కోరుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..వీరిలో అధికశాతం మంది ట్రంప్ నాయకత్వం పట్ల మాత్రం విముఖత ప్రదర్శించారు. ప్రతి ఏటా జరిగే లౌరీ ఇన్‌స్టిట్యూట్ పోల్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి

Tags :
|
|
|

Advertisement