Advertisement

  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ...భారీ మార్పులతో టీమిండియా

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ...భారీ మార్పులతో టీమిండియా

By: Sankar Fri, 04 Dec 2020 1:35 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ...భారీ మార్పులతో టీమిండియా


ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఓటమి తర్వాత పొట్టి ఫార్మాట్‌లో తలపడుతోంది టీమిండియా. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ ముందుగా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో ఈ ఫార్మాట్‌తో టీమిండియా ప్రధాన ఆటగాళ్లు రాహుల్, ధావన్, హార్దిక్, మంచి టచ్‌లో ఉన్నారు. ఇటీవల వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన నటరాజన్‌.. టీ20ల్లో సైతం అరంగేట్రం చేశాడు.అయితే అనూహ్యంగా టీమిండియా కీలక బౌలర్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చింది...

ఇక భారత్, ఆసీస్‌ మధ్య జరిగిన 20 టి20ల్లో భారత్‌ 11 గెలిచి 8 ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 2018లో ఇరుజట్లు రెండు టీ20లు జరగ్గా అందులో ఒకదాంట్లో భారత్‌ విజయం సాధించింది, మరొకదాంట్లో ఫలితం తేలలేదు. వర్షం కారణంగా ఆసీస్‌ బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత ఆ మ్యాచ్‌ రద్దయ్యింది. ఇక 2016లో ఆసీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆ మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-0తేడాతో గెలిచింది. ఇరుజట్లు తలపడిన చివరి ఐదు టీ20ల్లో ఆసీస్‌ మూడు గెలిచింది.

Tags :
|
|
|
|

Advertisement