Advertisement

మూడో టి ట్వంటీ లో ఆస్ట్రేలియా ఘనవిజయం ...

By: Sankar Tue, 08 Dec 2020 6:11 PM

మూడో టి ట్వంటీ లో ఆస్ట్రేలియా ఘనవిజయం ...


ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో టి ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా పోరాడి ఓడింది ...చివరి వరకు టీమిండియా గెలుపుకోసం కోహ్లీ పోరాడినప్పటికీ మిగతా బేట్స్మెన్ నుంచి సహకారం కరువు అవ్వడంతో విజయడానికి కొద్దీ దూరంలోనే టీమిండియా నిలిచిపోయింది...దీనితో సిరీస్ వైట్ వాష్ చేసే అవకాశం మిస్ అయింది..

తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఆస్ట్రేలియాను బాటింగ్ కు ఆహ్వానించింది...దీనితో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి.. కోహ్లీసేన ముందు 187 పరుగుల టార్గెట్‌ పెట్టింది.ఆసీస్ జట్టులో వేడ్, మాక్స్ వెల్ అర్థసెంచరీలతో రాణించారు..

ఇక 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు తొలి ఓవర్లో రెండో బంతికే కె ఎల్ రాహుల్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది...ఇలా తొలి ఓవర్లోనే బాటింగ్ కు వచ్చిన కోహ్లీ తొలి నుంచి ధాటిగా ఆడుతూ టీమిండియా ను విజయం దిశగా నడిపించాడు అయితే ఇతర బైట్స్మెన్ వెంటవెంటనే అవుట్ అవ్వడంతో లక్ష్యానికి 12 పరుగుల దూరంలోనే టీమిండియా నిలిచిపోయింది...

Tags :
|
|

Advertisement