Advertisement

  • ఆస్ట్రేలియాలో తెలుగు భాషకు సముచిత స్థానం ..ప్రాథమిక విద్యలో ఐచ్చిక భాషగా ఎంచుకునే అవకాశం ..

ఆస్ట్రేలియాలో తెలుగు భాషకు సముచిత స్థానం ..ప్రాథమిక విద్యలో ఐచ్చిక భాషగా ఎంచుకునే అవకాశం ..

By: Sankar Fri, 17 July 2020 09:19 AM

ఆస్ట్రేలియాలో తెలుగు భాషకు సముచిత స్థానం ..ప్రాథమిక విద్యలో ఐచ్చిక భాషగా ఎంచుకునే అవకాశం ..



ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగు భాషకు సముచిత స్థానం కల్పించింది ...ఇండియా నుంచి చాల మంది ఉద్యోగాలకోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు ..అలాంటివారికోసం ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగు భాషకు పట్టం కట్టింది.

అంతేకాకుండా తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో 5 పాయింట్‌లు అదనంగా వస్తాయి. చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లు శాశ్వత నివాసం కోసం కూడా తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ అక్రిడిటేషన్‌ అథారిటీ ఫర్‌ ట్రాన్సిలేటర్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటర్స్‌ (నాటి) నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు 5 పాయింట్లు అదనంగా కలుస్తాయి.

ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ,తమిళ భాషలకు అక్కడి ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించగా, 4వ భాషగా తెలుగు ఆ గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. దీంతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ, విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్,సౌత ఆస్ట్రేలియా, తదితర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి ప్రయోజనం లభించనుంది.

Tags :
|
|
|

Advertisement