Advertisement

  • నేను ధోనిని కాదు ...నాకు అంత వేగం లేదు ....ఆస్ట్రేలియా కీపర్ వేడ్ సంచలన కామెంట్స్

నేను ధోనిని కాదు ...నాకు అంత వేగం లేదు ....ఆస్ట్రేలియా కీపర్ వేడ్ సంచలన కామెంట్స్

By: Sankar Mon, 07 Dec 2020 08:37 AM

నేను ధోనిని కాదు ...నాకు అంత వేగం లేదు ....ఆస్ట్రేలియా కీపర్ వేడ్ సంచలన కామెంట్స్


మహేంద్ర సింగ్ ధోని ..ప్రపంచ క్రికెట్ లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..వికెట్ కీపర్ గా ఎన్నో సార్లు ఆశ్చర్యపోయే విధంగా బాట్స్మెన్ అవుట్ చేసాడు...అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ధోని గురించి ఎదో ఒక చర్చ నడుస్తూనే ఉంది ...తాజాగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెకండ్ టి ట్వంటీ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ , వికెట్ కీపర్ వేడ్ ధోని ప్రస్తావన తీసుకువచ్చాడు...

వివరాల్లోకి వెళ్తే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్, తాత్కలిక కెప్టెన్ మాథ్యూ వేడ్, టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మాథ్యూ వేడ్ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డవ్వడంతో ఆ సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

శిఖర్ ధావన్‌ను స్టంపౌట్ చేసే అవకాశాన్ని మాథ్యూ వేడ్ చేజార్చాడు. 39 పరుగుల వద్ద ధావన్‌ను ఔట్ చేసే అవకాశాన్ని జారవిడ్చిన వేడ్.. 'ధోనీలా రెప్పపాటులో స్టంపౌట్ చేయడానికి నేను ధోనీని కాదు' అని శిఖర్‌తో నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్‌కు ధావన్ సైతం నవ్వుతూ కనిపించాడు.

Tags :
|
|

Advertisement