Advertisement

  • విరాట్ బ్యాటింగ్ చేస్తే చూడాలనిపిస్తుంది కానీ ...!

విరాట్ బ్యాటింగ్ చేస్తే చూడాలనిపిస్తుంది కానీ ...!

By: Sankar Mon, 16 Nov 2020 09:54 AM

విరాట్ బ్యాటింగ్ చేస్తే చూడాలనిపిస్తుంది కానీ ...!


టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఆస్ట్రేలియన్లకు ద్వేషం, ఇష్టం రెండూ ఉంటాయని ఆ దేశ టెస్టు జట్టు సారథి టిమ్‌ పైన్‌ అన్నాడు. ప్రత్యర్థి ఆటగాడిగా తమపై అధిక పరుగులు చేస్తుంటే విరాట్‌ను ద్వేషిస్తామని, మరోవైపు అతడి బ్యాటింగ్‌ చూసేందుకు ఇష్టపడతామని చెప్పాడు.

పైన్‌ ఆదివారం మాట్లాడుతూ.. ‘కోహ్లీ గురించి చాలా మంది నన్ను ప్రశ్నలు అడుగుతారు. కానీ నాకు అతడితో అంత అనుబంధం లేదు. టాస్‌ వేసినప్పుడు, ప్రత్యర్థి జట్టులో ఆడినప్పుడే నేను అతడిని చూసేది. క్రికెట్‌ అభిమానిగా విరాట్‌ బ్యాటింగ్‌ చూసేందుకు ఇష్టపడతా. కానీ ప్రత్యర్థి జట్టులో ఎక్కువ పరుగులు చేస్తుంటే అతడిపై కోపం వస్తుంది’అని పైన్‌ చెప్పాడు.

2018-19 పర్యటనలో కోహ్లీ, పైన్‌ మధ్య మైదానంలో చాలాసార్లు మాటల యుద్ధం సాగింది. పలుమార్లు అంపైర్లు సైతం కలుగజేసుకున్నారు. మొత్తంగా 2-1తో సిరీస్‌ గెలిచి ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Advertisement