Advertisement

  • సిరీస్ విజయం సాధించి ఊపు మీద ఉన్న ఆస్ట్రేలియా కు గట్టి షాక్ ..స్టార్ ఆటగాడు వార్నర్ కు గాయం

సిరీస్ విజయం సాధించి ఊపు మీద ఉన్న ఆస్ట్రేలియా కు గట్టి షాక్ ..స్టార్ ఆటగాడు వార్నర్ కు గాయం

By: Sankar Sun, 29 Nov 2020 8:07 PM

సిరీస్ విజయం సాధించి ఊపు మీద ఉన్న ఆస్ట్రేలియా కు గట్టి షాక్ ..స్టార్ ఆటగాడు వార్నర్ కు గాయం


భారత-ఆస్ట్రేలియా సిరీస్‌లో మంచి దూకుడు మీదున్న కంగారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాతో రెండో వన్డేలో ఆడుతున్న డేవిడ్​ వార్నర్​కు గాయమైంది. ​

భారత బ్యాట్స్​మన్​ ధావన్​ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో ఈ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మ్యాచ్​ మధ్యలోనే మైదానం నుంచి వెళ్లి పోయారు​. తొడ కండరానికి గాయమైనట్లు ఆసీస్​ జట్టు ఫిజిషియన్లు తెలిపారు.స్కానింగ్​ చేశాక అతడి పరిస్థితిని చెబుతామని తెలిపారు..

ఇక రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ టీమ్.. ఆట ఆరంభం నుంచే వీర బాదుడు బాదారు. ఆసిస్ టాప్ ఆర్డర్ అంతా 50కి పైగా పరుగులు చేసి అద్భుత ప్రదర్శనం కనబరచడంతో జట్టు స్కోర్ అమాంతం పెరిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 389/4 పరుగులు చేసిన కంగారూలు టీమిండియాపై తొలి వన్డేలో నెలకొల్పిన 374/6 రికార్డ్‌ను తిరగరాశారు. ఇప్పుడు ఈ స్కోర్ వన్డేల్లో భారత్‌పై కంగారూలు చేసిన అత్యధిక స్కోరుగా రికార్డులకెక్కింది.

Tags :
|

Advertisement