Advertisement

  • కోహ్లీ ని వరుసగా మూడు సార్లు అవుట్ చేసి రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్

కోహ్లీ ని వరుసగా మూడు సార్లు అవుట్ చేసి రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్

By: Sankar Wed, 02 Dec 2020 9:40 PM

కోహ్లీ ని వరుసగా మూడు సార్లు అవుట్ చేసి రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్


ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడు వన్ డే ల సిరీస్ లో టీంఇండియా ఓటమిపాలు అయిన విషయం తెలిసిందే..ఈ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ రెండు అర్థసెంచరీలు చేసినప్పటికీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు..ఇక వన్ డే క్రికెట్ లో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 12000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన కోహ్లీ , ఈ సిరీస్లో ఒక అవసరంలేని రికార్డు కూడా మూటకట్టుకున్నాడు...

అదే ఈ సిరీస్ లో మూడు సార్లు కోహ్లీ హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లోనే మూడుసార్లు ఔటవ్వడం విశేషం. ఓవరాల్‌గా హాజల్‌వుడ్‌ ఇప్పటివరకు కోహ్లిని 7 సార్లు ఔట్‌ చేయగా.. అందులో వన్డేల్లో నాలుగుసార్లు, టెస్టుల్లో మూడు సార్లు ఉన్నాయి. దీంతో కోహ్లిని ఎక్కువసార్లు ఔట్‌ చేసిన ఆటగాళ్ల సరసన హాజిల్‌వుడ్‌ చోటు దక్కించుకున్నాడు. ఇంతకమందు ఆసీస్‌కే చెందిన ఆడమ్‌ జంపా, నాథన్ లియోన్‌లతో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మోర్సీ మోర్కెల్‌, విండీస్‌ రవి రాంపాల్‌లు ఏడేసి సార్లు ఔట్‌ చేశారు.

ఇక టెస్టుల్లో చూసుకుంటే కోహ్లిని ఎక్కువసార్లు ఔట్‌ చేసిన ఘనత ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ పేరిట ఉంది. కోహ్లిని అండర్సన్‌ 8 సార్లు ఔట్‌ చేయగా.. ఇంగ్లండ్‌కే చెందిన గ్రేమి స్వాన్‌ కూడా కోహ్లిని 8 సార్లు ఔట్‌ చేశాడు. ఇక ఓవరాల్‌గా వన్డే, టెస్టులు కలిపి మొత్తంగా చూసుకుంటే కివీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ 10 సార్లు కోహ్లిని ఔట్‌ చేయడం విశేషం.

Tags :
|
|
|

Advertisement