Advertisement

  • అన్ని రకాల క్రికెట్ కు గుడ్ బై చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్

అన్ని రకాల క్రికెట్ కు గుడ్ బై చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్

By: Sankar Tue, 03 Nov 2020 06:14 AM

అన్ని రకాల క్రికెట్ కు గుడ్ బై చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్


ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ షేన్ వాట్సాన్ అన్ని రకాల క్రికెట్ ఫార్మట్స్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వాట్సాన్.. నిన్న ఆ జట్టు చివరి మ్యాచ్ పంజాబ్ తో ఆడిన తర్వాత డ్రెసింగ్ రూమ్ లో ''ఇక తాను ఐపీఎల్ తో కలిపి అన్ని రకాల క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు తన జట్టు సభ్యులకు చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే 2015 ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత 2016 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు వాట్సాన్. 2008 నుండి ఐపీఎల్ లో ఆడుతున్న వాట్సాన్ మొదట రాజస్థాన్ రాయల్స్ కు ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడాడు. ఇక 2018 వేలంలో చెన్నై అతడిని కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ లో 145 మ్యాచ్ లు ఆడిన వాట్సాన్ మొత్తం 3,874 పరుగులు, 92 వికెట్లు అలాగే 40 క్యాచ్ లు అందుకున్నాడు.

ఆస్ట్రేలియా జట్టు తరుపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాట్సన్ , ప్రపంచ అత్యుత్తమ అల్ రౌండర్లలో ఒకడిగా ఎదిగాడు..ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో ఎన్నో సంచలనాత్మక ప్రదర్శనలతో ఆస్ట్రేలియా జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు..ఇక ఐపీయల్ లో కూడా తొలి సీజన్లో వార్న్ సారధ్యంలోని రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన వాట్సన్ ఆ జట్టు టైటిల్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు..ఇక సిఎస్కె కూడా 2018 ఐపీయల్ ఫైనల్లో వాట్సన్ సంచలన ఇన్నింగ్స్ తో టైటిల్ ఎగరేసుకుపోయింది..2019 ఫైనల్లో కూడా చివరి వరకు పోరాడిన వాట్సన్ చివరి ఓవర్లో అవుట్ అవ్వడంతో సీఎస్కె జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది..

Tags :

Advertisement