Advertisement

  • మాజీ కెప్టెన్ స్మిత్ పై ప్రశంసలు కురిపించిన ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్

మాజీ కెప్టెన్ స్మిత్ పై ప్రశంసలు కురిపించిన ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్

By: Sankar Mon, 07 Dec 2020 9:11 PM

మాజీ కెప్టెన్ స్మిత్ పై ప్రశంసలు కురిపించిన ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్


ఆస్ట్రేలియా జట్టులో బాల్ టాంపరింగ్ సాగాకు ముందు అన్ని ఫార్మాట్లలో కూడా స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించాడు ..అయితే బాల్ టాంపరింగ్ సాగా అస్ట్రేలియా జట్టును ఒక కుదుపు కుదపడంతో అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియా జట్టుకు డిఫరెంట్ కెప్టెన్లు వచ్చారు ...ప్రస్తుతం లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఫించ్ గాయపడటంతో అతడి స్థానం లో వేడ్ టీమిండియా తో జరిగిన సెకండ్ టి ట్వంటీ లో కెప్టెన్ గా వ్యవహరించాడు...

ఈ నేపథ్యంలో తన ప్రదర్శన గురించి వేడ్‌ మాట్లాడుతూ.. ‘‘అవును.. నాకిప్పుడు 32 ఏళ్లు. చాలా కాలం నుంచి క్రికెట్‌ ఆడుతున్నా. అయితే నేనొక డిఫరెంట్‌ ప్లేయర్‌ను అని చెప్పగలను. అవును.. మాథ్యూ వేడ్‌ వికెట్‌ కీపర్‌- బ్యాటర్‌. గతంలో కంటే ఎంతో భిన్నంగా ఆడుతున్నాడు. మూడేళ్లుగా తన ఆట తీరులో మార్పు వచ్చింది. రెండేళ్ల క్రితం కెరియర్‌ని రీస్టార్డ్‌ చేసిన ఫీలింగ్‌ తనది. ముప్పైవ ఏట మరోసారి అరంగేట్రం’’ అని చెప్పుకొచ్చాడు..

అంతే కాకుండా స్మిత్‌, మోజెస్‌ హెన్రిక్స్‌(బీబీఎల్‌ టీం సారథి) వంటి ఎంతో మంది గొప్ప నాయకులు, అనుభవజ్ఞులు మా జట్టులో ఉన్నారు. ఫించీ మా కెప్టెన్‌. తను బాగా ఆడితే మేం కూడా మెరుగ్గా రాణిస్తాం. నిజానికి స్మిత్‌ కూడా గొప్ప కెప్టెన్‌. సుదీర్ఘకాలం పాటు సారథిగా సేవలు అందించాడు. మళ్లీ అవకాశం వస్తే అంతే గొప్పగా జట్టును ముందుండి నడిపిస్తాడు. అయినప్పటికీ నాకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. సీనియర్లంతా చాలా సేపు చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా మేమంతా ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటాం. సమిష్టిగా ఆడతాం’’ అని అన్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాట్సమెన్...

Tags :

Advertisement