Advertisement

  • టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా కీ ప్లేయర్ దూరం...

టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా కీ ప్లేయర్ దూరం...

By: chandrasekar Wed, 09 Dec 2020 7:46 PM

టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా కీ ప్లేయర్ దూరం...


ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ తొడకండరాల గాయంతో భారత్‌తో ఆఖరి వన్డే, టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తొలి టెస్టుకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ట్విటర్‌ వేదికగా తెలిపింది. డిసెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం అవనుంది. అడిలైడ్ వేదికగా తొలి డే అండ్ నైట్ టెస్టు జరగనుంది. అయితే, పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో పది రోజుల సమయం పడుతుందని వార్నర్‌ అన్నాడు.

రెండో టెస్టుకు అందుబాటులో ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు ఈ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వార్నర్ చెప్పాడు. ‘‘గాయం నుంచి కోలుకున్నా. అయితే టెస్టు మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా 100 శాతం ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నాను. క్రీజ్ లోకి వాచ్చాక వికెట్ల మధ్య పరుగెత్తడంలో, మైదానంలో చురుకుగా ఉండాలి. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరో 10 రోజులు పడుతుంది’’ అని డేవిడ్‌ వార్నర్ తెలిపాడు. డేవిడ్‌ గాయం గురించి ఆస్ట్రేలియా జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మాట్లాడుతూ.. అతడు మెల్‌బోర్న్‌ టెస్టుకు పూర్తిఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కు వార్నర్‌ దూరం కావడం ఆస్ట్రేలియాకు లోటే. పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో అతడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆసీస్‌ యువ ఓపెనర్‌ విల్‌ పకోస్కీ కూడా కంకషన్‌కు గురికావడం ఆ జట్టు‌ను కలవరపెడుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కార్తీక్‌ త్యాగి విసిరిన బౌన్సర్‌ అతడి హెల్మెట్‌కు తాకింది. అతను డిసెంబర్‌ 11 నుంచి జరిగే రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు దూర౦గా ఉండబోతున్నాడు.

Tags :
|

Advertisement