Advertisement

  • స్లో ఓవర్ రేట్ కారణంగా టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లలో ఆసీస్ జట్టుకు కోత

స్లో ఓవర్ రేట్ కారణంగా టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లలో ఆసీస్ జట్టుకు కోత

By: Sankar Tue, 29 Dec 2020 6:45 PM

స్లో ఓవర్ రేట్ కారణంగా టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లలో ఆసీస్ జట్టుకు కోత


టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఓటమి పాలైన ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు బాక్సింగ్‌ డే టెస్టులో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆసీస్‌క వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లలో కోత పడింది. అదే సమయంలో ఆసీస్‌ జట్టుకు 40 శాతం జరిమానా విధించారు.

దీనికి కారణం ఆ జట్టు స్లో ఓవర్‌ రేట్‌. నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో ఆసీస్‌కు చాంపియన్‌షిప్‌ పాయింట్లలో కోతతో పాటు భారీ జరిమానా విధించారు. ఆసీస్‌ స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేసిన విషయాన్ని మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ ధృవీకరించారు. దీన్ని ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండానే ఆ జట్టుకు పాయింట్లలో కోతతో పాటు జరిమానా విధించారు.

ఇక్కడ రెండు ఓవర్లు ఆలస్యంగా పడటంతో ఆసీస్‌కు నాలుగు టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లతో పాటు 40 శాతం జరిమానా పడింది. ఐసీసీ నిబంధనల్లో భాగంగా టెస్టు చాంపియన్‌షిప్‌లో ఓవర్లు తక్కువగా పడితే ప్రతీ ఓ‍వర్‌ను పరిగణలోకి తీసుకుంటారు..

Tags :
|

Advertisement