Advertisement

  • ఇండియా తో తొలి టెస్ట్ కు ముందు ఆస్ట్రేలియాకు గొప్ప ఊరట

ఇండియా తో తొలి టెస్ట్ కు ముందు ఆస్ట్రేలియాకు గొప్ప ఊరట

By: Sankar Sun, 13 Dec 2020 7:42 PM

ఇండియా తో తొలి టెస్ట్ కు ముందు ఆస్ట్రేలియాకు గొప్ప ఊరట


ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఇంకో నాలుగు రోజుల్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది...అయితే ఆస్ట్రేలియా జట్టుకు గాయాల సమస్యలు వేధిస్తున్నాయి...

స్టార్ ఓపెనర్ వార్నర్ గాయంతో దూరమయ్యాడు...అయితే తొలి టెస్ట్ కు ముందు ఆస్ట్రేలియాకు గొప్ప ఊరట కలిగింది..అదే ఇటీవల ఆస్ట్రేలియా జట్టుని అర్ధాంతరంగా వీడిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్.. సోమవారం తిరిగి జట్టుతో చేరబోతున్నాడు.

డిసెంబరు 4న కాన్‌బెర్రా వేదికగా భారత్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో చివరిగా ఆడిన మిచెల్ స్టార్క్.. అనంతరం తన కుటుంబంలో ఒకరు తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతితో అతను టీమ్‌ని వీడాడు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌ పూర్తిగా బయో- సెక్యూర్ వాతావరణంలో జరుగుతుండగా.. ఆరోజు బబుల్ నుంచి వెలుపలికి వెళ్లిన మిచెల్ స్టార్క్.. సోమవారం మళ్లీ బబుల్‌లోకి రానున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా టీమ్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆదివారం ఓ ప్రకటనని విడుదల చేశాడు.

Tags :
|
|
|

Advertisement