Advertisement

తొలి వన్ డే లో ఆసీస్ ఘనవిజయం...

By: Sankar Fri, 27 Nov 2020 6:00 PM

తొలి వన్ డే లో ఆసీస్ ఘనవిజయం...


ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్‌ నిర్దేశించిన 375 పరుగుల టార్గెట్‌లో భాగంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్యా(90; 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌(74; 86 బంతుల్లో 10 ఫోర్లు)లు మాత్రమే హాఫ్‌ సెంచరీలు సాధించడంతో ఓటమి తప్పలేదు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ జట్టులో ఫించ్‌(114;124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌(105; 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్‌ వార్నర్‌(69; 76 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది...భారత ఫీల్డర్ల ఫీల్డింగ్ వైఫల్యం కూడా ఆసీస్ బాట్స్మెన్ కు బాగా కలిసి వచ్చింది...

లక్ష్య ఛేదనలో భాగంగా భారత్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌-శిఖర్‌ ధావన్‌లు ధాటిగా ప్రారంభించారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌ను మెయింటైన్‌ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 5 ఓవర్లలో 53 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు..అయితే మయాంక్ అగర్వాల్ , కోహ్లీ , అయ్యర్ , రాహుల్ వెంటవెంటనే అవుట్ అయ్యారు ..ఇక ఆ తర్వాత పాండ్య , ధావన్ రాణించినప్పటికీ టీం ఇండియా కు ఓటమి తప్పలేదు...

Tags :
|

Advertisement