Advertisement

  • భారత్‌తో సిరీస్ కోసం‌ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా...

భారత్‌తో సిరీస్ కోసం‌ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా...

By: chandrasekar Thu, 12 Nov 2020 10:26 PM

భారత్‌తో సిరీస్ కోసం‌ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా...


ఆస్ట్రేలియా (సీఏ) స్వదేశంలో భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌ కోసం 17 మంది సభ్యుల జట్టును క్రికెట్‌ ఇవాళ ప్రకటించింది. టిమ్‌ పైన్‌ కెప్టెన్సీలోని ఆసీస్‌ జట్టు భారత్‌తో తలపడనుంది. యువ ఆటగాళ్లు విల్‌ పుకోస్కీ(22), కెమెరాన్‌ గ్రీన్‌లను తొలిసారి టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేశారు.అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లు ఫాస్ట్‌ బౌలర్‌ సీన్‌ అబాట్, లెగ్‌స్పిన్నర్‌ మిచెల్‌ వెప్సన్‌, ఆల్‌రౌండర్‌ మిఖైల్‌ నీజర్‌లకు చోటు దక్కింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన జో బర్న్స్‌ స్థానంలో పుకోస్కీ ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెషీల్డ్‌ ఫీల్డ్‌లో విక్టోరియా బ్యాట్స్‌మన్‌ విల్‌ పుకోస్కీ(22) సంచలన బ్యాటింగ్‌ చేసాడు. సౌత్‌ ఆస్ట్రేలియాపై 255 నాటౌట్‌, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాపై 202 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. నవంబర్‌ 27 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌తో పర్యటన మొదలుకానుంది. మూడు వన్డేలు, మూడు టీ20 తర్వాత నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ డిసెంబర్‌ 17 నుంచి ఆరంభంకానుంది.

ఆస్ట్రేలియా జట్టు‌:

టిమ్‌పైన్‌(కెప్టెన్‌), సీన్‌ అబాట్‌, జో బర్న్స్‌, పాట్‌ కమిన్స్‌, కెమెరాన్‌ గ్రీన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, మార్నస్‌ లబుషేన్‌, నాథన్‌ లైయన్‌, మైఖేల్‌ నీజర్‌, జేమ్స్‌ పాటిన్సన్‌, విల్‌ పుకోస్కీ, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ వెప్సన్‌, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌ వార్నర్‌

Tags :
|

Advertisement