Advertisement

  • సోషల్ మీడియా పై అణిచివేత ధోరణి వద్దు ...అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్

సోషల్ మీడియా పై అణిచివేత ధోరణి వద్దు ...అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్

By: Sankar Tue, 08 Dec 2020 11:02 AM

సోషల్ మీడియా పై అణిచివేత ధోరణి వద్దు ...అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్


సోషల్‌ మీడియాను అణచివేయాలనుకోవడం సరైంది కాదని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ చెప్పారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధిస్తే ప్రభుత్వానికి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అతి తక్కువ కేసుల్లోనే సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు చేపడుతుందని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో బహిరంగ చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచి చేసే పరిణామమేనని వ్యాఖ్యానించారు. హద్దులు మీరితే తప్ప సాధారణంగా విమర్శలపై సుప్రీంకోర్టు పెద్దగా స్పందించబోదని అన్నారు.

భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యలను ప్రారంభించకూడదని ప్రభుత్వానికి కె.కె.వేణుగోపాల్‌ సూచించారు. స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం, బహిరంగ చర్చలు అవసరమేనని తెలిపారు. సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని ట్వీట్లు చేస్తున్న వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. అలాంటి విజ్ఞప్తులు త్వరలో ఆగిపోతాయని ఆశిస్తున్నట్లు పీటీఐకి తెలిపారు. ఎవరిపై అయినా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటే అటార్నీ జనరల్‌ లేదా సొలిసిటర్‌ జనరల్‌ అంగీకారం తెలిపాల్సి ఉంటుంది.

Tags :

Advertisement