Advertisement

  • భారత్‌లోనే ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్ నిర్వహణకు యత్నాలు

భారత్‌లోనే ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్ నిర్వహణకు యత్నాలు

By: chandrasekar Tue, 29 Sept 2020 09:18 AM

భారత్‌లోనే  ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్ నిర్వహణకు యత్నాలు


కరోనా వల్ల ఐపీల్ మ్యాచ్లను యూఏఈ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ మన దేశంలోనే ఇంగ్లాండ్ సీరియస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌లోనే ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్ నిర్వహించేందుకు బిసిసిఐ అన్నివిధాల ప్రయత్నిస్తున్నట్టు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. అలాగే దేశీ టోర్నమెంట్స్ సైతం జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సోమవారం గంగూలీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జనవరి - మార్చి మధ్య కాలంలో ఇంగ్లాండ్ భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఐదు టెస్ట్ మ్యాచులు, మూడు వన్డే ఇంటర్నేషనల్, మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడే విధంగా ఇండియా, ఇంగ్లండ్ జట్లు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాయి. భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఓవైపు కరోనా పరిస్థితులను గమనిస్తూనే మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్ జరిగేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు గంగూలీ తెలిపారు.

మన దేశంలోనే ఈ సిరీస్ జరపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ కూడా యూఏఈలోనే జరగనుందా అనే సందేహాలపై స్పందిస్తూ యూఏఈలో అబు ధాబి, షార్జా, దుబాయ్‌లో మూడు స్టేడియంలు ఉన్నాయని అలాగే మనకు కూడా ఇండియాలోనే మ్యాచులు నిర్వహించుకునే విధంగా ముంబైలో సీసీఐ, వాంఖడే, డివై పాటిల్ స్టేడియం, కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలు ఉన్నాయని గంగూలీ అభిప్రాయపడ్డారు. 2019-20లో దేశంలో పురుషులు, మహిళలు, అన్ని ఏజ్ గ్రూప్స్, అన్ని ఫార్మాట్స్ కలిపి 2036 మ్యాచ్‌లు నిర్వహించామని చెప్పిన గంగూలీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం బయో బబుల్‌లో మాత్రమే మ్యాచులు నిర్వహించాలని అన్ని మ్యాచులు అలా నిర్వహించడం సాధ్యపడదని అన్నారు. ఓవైపు యూఏఇలో ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ కోసం జట్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తూనే మరోవైపు భారత్‌లో భవిష్యత్‌లో ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. కట్టుబాట్లు సడలించడంతో ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

Tags :
|

Advertisement