Advertisement

  • చైనా సరిహద్దు వివాదం చల్చార్చే ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు

చైనా సరిహద్దు వివాదం చల్చార్చే ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు

By: chandrasekar Thu, 10 Dec 2020 7:22 PM

చైనా సరిహద్దు వివాదం చల్చార్చే ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు


భారత్ మరియు చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదని జయశంకర్ తెలిపారు. ఇందుకు చైనా వైఖరే కారణమని, ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను డ్రాగన్ ఉల్లంఘించడమే కారణమని అయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య గత ఏడు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది మరియు ఇరు దేశాలూ సైన్యాలను భారీగా మోహరించడంతో చర్చలు, సంప్రదింపుల ద్వారా ఉద్రిక్తతలను చల్చార్చే ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదని చెప్పారు. ఇప్పటికే భారత, చైనా సైనికాధికారుల మధ్య ఎనిమిది దఫాలుగా చర్చలు జరిగాయి. ఇరు దేశాలూ దశల వారీగా సైన్యాన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి వెనక్కు మళ్లించాలని నిర్ణయించినా ఏమాత్రం కార్యరూపం మాత్రం దాల్చలేదని అన్నారు. ఈ నేపథ్యంలో భారత్-చైనాల మధ్య సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత మూడు నాలుగు దశాబ్దాలతో పోల్చుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం దారుణంగా దిగజారాయని చెప్పారు. చైనా తమ సైన్యాన్ని వెనుకకు తీసుకోకుండా మరింత వుద్రేకతను ప్రేరేపిస్తుంది.

మన సరిహద్దు వెంబడి ప్రస్తుతం వేలాది సంఖ్యలో సైన్యాన్ని మోహరించిన చైనా ఇదేంటని ప్రశ్నిస్తే ఐదు పొంతన లేని సమాధానాలు చెబుతోందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమనేది చాలా పెద్ద విషయమని అయన పెదవి విరిచారు. చైనాపై భారత్‌లో వ్యతిరేకతకు గల్వాన్ ఘటన కారణమైందని జయశంకర్ అన్నారు. ఈ ఘటన దేశ ప్రజల సెంటిమెంట్‌లో మార్పు తీసుకొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జూన్‌ 15న జరిగిన గల్వాన్ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీనివల్ల దేశ ప్రజలు తీవ్రంగా స్పందించారని తెలిపారు. ఎల్‌ఏసీ వెంట శాంతి మరియు ప్రశాంతతను కాపాడుకోవడం అనేది ఇరుదేశాల మధ్య సంబంధాల పురోగతిపై ఆధారపడి ఉందని కానీ వాస్తవంగా సరిహద్దులో అటువంటి పరిస్థితిలేదు అని వ్యాఖ్యానించారు. మనకు ఈ సమస్య 1988 నుంచి ఉంది ఎందుకంటే ఇరు దేశాల మధ్య కొన్ని విబేధాలు ఉన్నాయి. వాణిజ్యం మరియు ప్రయాణాలు సహా అనేక ఇతర విభాగాల్లో ఈ సంబంధం పురోగమిస్తుందని, ఎల్ఏసీ వెంట శాంతి, ప్రశాంతతను కాపాడటానికి ఇరుదేశాల అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నాయని ఆయన అన్నారు. సరిహద్దులకు పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించవనే నిబద్ధతతో ఇరు దేశాలు 1993 నుంచి బహుళ ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు కొన్ని కారణాల వల్ల చైనా ఐదు విభిన్న వాదనలు వినిపిస్తూ ఉల్లంఘనకు పాల్పడుతోంది. దీనివల్ల ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.

Tags :
|

Advertisement