Advertisement

  • విడాకులిచ్చిన తన రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో హత్యాయత్నం

విడాకులిచ్చిన తన రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో హత్యాయత్నం

By: chandrasekar Sat, 12 Sept 2020 5:22 PM

విడాకులిచ్చిన తన రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో హత్యాయత్నం


విడాకులిచ్చిన తన రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేయించాడా మాజీ భర్త. ఆ దాడిలో చెయ్యి తెగిపడిన బాధితుడు, ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఈ దారుణ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన ఇనుగాల విజయ్‌కి ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. రెండో భార్య కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట పట్టణ ప్లానింగ్‌ అధికారి. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోటీకి దిగాలంటే ఇద్దరు భార్యలు ఉండరాదన్న నిబంధనతో రెండో భార్యకు విజయ్‌ విడాకులిచ్చారు.

ఆ తర్వాత ఆమె, కారు డ్రైవర్‌ ఇనుగాల తిరుపతిని ప్రేమించి గుడిలో దండలు మార్చుకున్నారు. దీంతో తన భార్యను తిరుపతి అపహరించాడని కేసు పెట్టారు. తిరుపతిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మరోవైపు విజయ్‌, అతడి రెండో భార్య మళ్లీ కలిసిపోయారు. కొన్నాళ్లకు బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తిరుపతి, పని కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాడు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి రాగా.విజయ్‌ తన రెండో భార్యతో కలిసి అతడి హత్యకు ప్లాన్ వేసాడు. ఇనుగాల కుమార్‌, ఇనుగాల మొగిలి, ఇనుగాల సాంబయ్య, ఇనుగాల రాజు, ఇనుగాల రవి కలసి తిరుపతిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తిరుపతి చెయ్యి తెగికిందపడిపోయింది. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది.

Tags :
|

Advertisement