Advertisement

  • కంటిలో డ్యామేజ్ అయిన నర్వ్ ను బైపాస్ చేయడం ద్వారా కంటి చూపు తెప్పించే ప్రయత్నం

కంటిలో డ్యామేజ్ అయిన నర్వ్ ను బైపాస్ చేయడం ద్వారా కంటి చూపు తెప్పించే ప్రయత్నం

By: chandrasekar Mon, 21 Sept 2020 10:42 AM

కంటిలో డ్యామేజ్ అయిన నర్వ్ ను బైపాస్ చేయడం ద్వారా కంటి చూపు తెప్పించే ప్రయత్నం


మన శరీరంలోని ఏ ఒక్క అవయవం పనిచేయకున్నా జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. అందుకే శరీరంలోని అన్ని ఇంద్రియాలు ముఖ్యమైనవే. కానీ కండ్లు లేకుండా బతకడం చాలా కష్టం. కొందరు పుట్టుకతోనే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుండగా మరికొందరిలో ఆరోగ్య సమస్యల కారణంగా కండ్లు పనిచేయకుండా పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కంటి చూపు కోల్పోయిన ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఇలాంటి వారి కోసం బయోనిక్ సొల్యూషన్స్ ద్వారా కంటి చూపు తెప్పించేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు జరుపుతున్నారు. అయితే, వీరి ప్రయత్నంలో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం పరిశోధనలు విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదేండ్ల పాటు కష్టపడిన పరిశోధకులు బయోనిక్ ఐ ని తయారుచేశారు.

కంటిలో డ్యామేజ్ అయిన నర్వ్ ను బైపాస్ చేయడం ద్వారా కంటి చూపు తెప్పించవచ్చంటున్నారు వీరు. ప్రత్యేకంగా తయారుచేసిన హెడ్ గేర్ సహాయంతో బయోనిక్ ఐ పనిచేస్తుంది. పుట్టుకతో వచ్చే అంధత్వాన్ని పరిష్కరించేందుకు మెదడులో ఈ బయోనిక్ ఐ ని ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బయోనిక్ ఐ సాయంతో వస్తువులను స్పష్టంగా గుర్తించలేకపోయినా వస్తువులను మాత్రం గుర్తించవచ్చంటున్నారు మోనాష్ శాస్త్రవేత్తలు. గొర్రెలపై చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో ప్రస్తుతం మనుషులపై ప్రయోగించేపనిలో ఉన్నారు. మెదడు యొక్క ఉపరితలంపై అమర్చే వైర్‌లెస్ ట్రాన్స్మిటర్ చిప్‌ను రూపొందించాం. దీనికి 'బయోనిక్ ఐ' అని పేరు పెట్టాం. ఇది కెమెరాతో అమర్చిన హెడ్‌గేర్‌ను కలిగి ఉండి చుట్టూ ఉన్న కదలికలపై నిఘా ఉంచడం ద్వారా మెదడును నేరుగా సంప్రదిస్తుంది. దీనివల్ల ఎదురుగా ఉన్న వస్తువులను కొంతమేరకు చూడగలుగుతారు అని ప్రొఫెసర్ లావోరి పేర్కొన్నారు.

Tags :

Advertisement