Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నిక... తెరాస ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ పై దాడి

దుబ్బాక ఉప ఎన్నిక... తెరాస ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ పై దాడి

By: Sankar Tue, 03 Nov 2020 05:58 AM

దుబ్బాక ఉప ఎన్నిక... తెరాస ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ పై దాడి


దుబ్బాక ఉప ఎన్నిక...ఉద్రిక్తతలకు దారి తీసింది. మరోసారి బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఫైటింగ్‌కు దిగారు. సిద్ధిపేటలో స్వర్ణప్యాలెస్‌ దగ్గర రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే మీద దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. బిజెపి కార్యకర్తలు తన మీద దాడికి ప్రయత్నించారు అని అని క్రాంతి కిరణ్ ఆరోపించారు.

దాడి చేస్తుంటే కొంత మంది పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని అయినా సరే నేనే టార్గెట్ అన్నట్టు వాళ్ళు తన మీదకు దూసుకు వచ్చారని ఆయన అన్నారు. తన రూంలో డబ్బులు ఉన్నయాని ఆరోపిస్తూ వాటిని వెతికేందుకు అక్రమంగా చొచ్చుకురావడానికి ప్రయత్నించినా సరే తాను వచ్చి వెతుక్కోవచ్చు అని చెప్పానని అన్నారు. అలా చెప్పినా తన మీద దాడి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారని ఆయన ఆరోపించారు. ఎవరో ఒకరి మీద దాడి చేసి దాన్ని సెన్సేషన్ క్రియేట్ చేయాలని వచ్చారని ఆయన ఆరోపించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పై బీజేపీ నాయకులు చేసిన దాడి పై మంత్రి హరీష్ రావు స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి , ఓర్వలేక బీజేపీ నాయకులు పని గట్టుకొని నియోజకవర్గం అవతల ప్రాంతంలో ఉన్న ఒక దళిత ఎమ్మెల్యే పై భౌతిక దాడులకు దిగడం చాలా శోచనీయం.. ఇది హేయమైన చర్య.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న అని హరీష్ రావు తెలిపారు. ఇది ఉద్దేశ పూర్వకంగా పథకం ప్రకారం కావాలని , వాళ్ళు ఉంటున్న హోటల్ కి వెళ్లి వారి పై భౌతిక దాడులకు పాల్పడటం వారి దిగా జారుడు తనానికి నిదర్శనం అని సూచించారు

Tags :
|

Advertisement