Advertisement

  • విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..

విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..

By: chandrasekar Tue, 08 Dec 2020 08:49 AM

విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..


పోలీసు సిబ్బందిపై దాడి చేయడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కుమారుడు ఫయాజ్‌ను బెంగ‌ళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్థరాత్రి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేసిన ఆరోపణలపై ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఫయాజ్‌తో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం అర్ధ‌రాత్రి 12.30 గంటల సమయంలో బెంగళూరులోని అమృతల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

ఆదివారం రాత్రి ఫయాజ్, మరో ఇద్దరు తన కారులో వెళ్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. ఫయాజ్ మాట్లాడ‌లేని స్థితిలో ఉన్నాడు. దీంతో అతను త‌న కారునే ఆపుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అక్క‌డే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ సమీపంలో పోలీసు బలగాలపై దాడి చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశాసిన‌ట్లు డీసీపీ (నార్త్ ఈస్ట్) బెంగళూరు సీకే బాబా తెలిపారు.

ఆ సమయంలో అతను పోలీసులతో వాగ్వాదానికి దిగి హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసినప్పుడు ఫయాజ్ మ‌ద్యం సేవించి ఉన్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఫయాజ్‌పై ఐపీసీ సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగిని తన విధుల‌ను నిర్వర్తించకుండా అడ్డుకొని దాడి చేయ‌డం) కింద అభియోగాలు మోపారు. కేసు దర్యాప్తులో ఉన్న‌ది. పోలీసుపై దాడి చేయడంతో ఈ విషయాన్ని తీవ్రంగా భావిస్తున్నారు.

Tags :
|

Advertisement