Advertisement

  • అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల దాడి...పబ్లిక్ టాయిలెట్స్ కాదు.. పబ్లిసిటీ టాయిలెట్స్

అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల దాడి...పబ్లిక్ టాయిలెట్స్ కాదు.. పబ్లిసిటీ టాయిలెట్స్

By: chandrasekar Thu, 19 Nov 2020 2:55 PM

అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల దాడి...పబ్లిక్ టాయిలెట్స్ కాదు.. పబ్లిసిటీ టాయిలెట్స్


గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈసారి ముఖ్యమంత్రితో పాటుఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. ఇటీవలే టీఎస్ బీపాస్ విధానం మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో పాటు పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచారం ఉన్న ఫ్లెక్సీలను మాజీ ఎంపీ కొండా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నా షాదీ ముబారక్ స్కీం, అయిదు రూపాయలకే అన్నం పెడుతున్న అన్నపూర్ణ క్యాంటిన్, టీఎస్ బీపాస్‌కు సంబంధించి పబ్లిక్ టాయిలెట్స్‌ వద్ద ఉన్న ఫ్లెక్సీలను పోస్టు చేశారు.

ఇవన్నీ పబ్లిక్ టాయిలెట్స్ కాదు.. పబ్లిసిటీ టాయిలెట్స్ అన్నారు. అంతేకాదు వీటిని పబ్లిక్‌తో పాటు కేసీఆర, కేటీఆర్ కూడా వాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఇప్పుడు కొండా పెట్టిన ట్వీట్ మరోసారి వైరల్ అయ్యింది.

ఇప్పటికే ఆయన ట్విట్టర్ వేదికగా అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వరద సాయంపై కూడా కొండా ఇటీవలే విమర్శలు చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్‌ను కూడా ప్రభుత్వం ఇలా వాడేస్తుందని కొండా పెట్టిన పోస్టుపై అధికార పార్టీ ఎలా బదులిస్తుందో చూడాలి.

Tags :

Advertisement