Advertisement

అట్లాస్‌ సైకిల్ ఫ్యాక్టరీ మూసివేసిన

By: chandrasekar Sat, 06 June 2020 7:18 PM

అట్లాస్‌ సైకిల్ ఫ్యాక్టరీ మూసివేసిన


అట్లాస్‌ సైకిల్ భారత్‌లో సైకిళ్లకు పేరొందిన కంపెనీగా వున్నది అందరికి తెలిసిందే. చాలా మంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అట్లాస్‌ సుపరిచతం. తాజాగా సైకిళ్ల ఉత్పత్తిని ఆ కంపెనీ రెండురోజుల క్రితం మూసివేసింది. ఫ్యాక్టరీని నడపడానికి నిధుల కొరత ఉందంటూ దేశ రాజధానికి సమీపంలోని సాహిబాబాద్‌లో తన చివరి తయారీ యూనిట్‌ను మూసివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. అట్లాస్‌ సీఈవో ఎన్పీ సింగ్‌ రాణా మాట్లాడుతూ 'కంపెనీ షట్‌డౌన్‌ తాత్కాలికమే మిగులు భూమిని అమ్మడం ద్వారా సుమారు రూ.50 కోట్లు సమీకరించుకోవాలనుకుంటున్నాం. ఆ తర్వాత తిరికి కార్యకలపాలను పునరుద్ధరిస్తామ'ని ఆయన స్పష్టం చేశారు.

జూన్‌ 3న ఫ్యాక్టరీని కంపెనీ మూసివేసింది. యాదృచికంగా అదే రోజు ప్రపంచ సైకిళ్ల దినోత్సం కావడం గమనార్హం. ఇక మిగిలిన 431 మంది ఉద్యోగులకు కూడా కంపెనీ తొలగించింది. అయినప్పటికీ వారిని సంస్థలో కొనసాగిస్తామని, రోజువారీ హాజరు ఆధారంగా లే-ఆఫ్‌ వేతనాలు చెల్లిస్తామని రాణా పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద ప్లాంట్ 1989లో ప్రారంభమైంది. ప్రతినెలా రెండు లక్షల సైకిళ్ల ఉత్పత్తితో అట్లాస్ సైకిల్‌ చివరి ప్లాంట్ ఇదే. ఎలాంటి నోటీసులు లేకుండా ఫ్యాక్టరీని మూసివేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement