Advertisement

  • సూడాన్‌లో పౌరులు, సైనికుల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణల్లో 127 మంది మృతి

సూడాన్‌లో పౌరులు, సైనికుల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణల్లో 127 మంది మృతి

By: chandrasekar Thu, 13 Aug 2020 5:49 PM

సూడాన్‌లో పౌరులు, సైనికుల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణల్లో 127 మంది మృతి


సూడాన్‌లో పౌరులు, సైనికుల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణల్లో 127 మంది మృతి చెందారు. దక్షిణ సూడాన్‌లో పౌరులు, సైనికుల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణల్లో 127 మంది మృతి చెందారు. సూడాన్‌లోని టోంజ్ నగరంలోని సైనికులు పౌరుల నుంచి ఆయుధాలను తీసుకునేందుకు శనివారం ఆపరేషన్ చేపట్టగా అది కాస్తా మత ఘర్షణగా మారింది.

ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ లుల్ రువై కోయాంగ్ బుధవారం ఈ సమాచారాన్ని వెల్లడించారు. సూడాన్ లో గత కొన్నేండ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కారణంగా అనేక సంఘాలు వారి భద్రత కోసం ఆయుధాలను అందజేశాయి. ఆయుధాలతో యువత ఆపరేషన్ చేయడాన్ని తోంజ్ సైనికులు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైందని ఆర్మీ ప్రతినిధి తెలిపారు.

ఇక్కడ తొలుత పరిస్థితులు అదుపులో ఉన్నప్పటికీ ఒక్కసారిగా యువకులు పెద్ద సంఖ్యలో రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ హింసాత్మక ఘర్షణలో మొత్తం 127 మంది మరణించినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. వీరిలో 45 మంది సైనికులు ఉండగా, 82 మంది యువకులు ఉన్నారు. ఘర్షణలో 32 మంది సైనికులు కూడా గాయపడ్డారు. హింసను ప్రేరేపించిన ఇద్దరు సైనిక అధికారులను అరెస్టు చేశారు.

కానీ ప్రస్తుతానికి, టోంజ్ నగరంలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. దక్షిణ సూడాన్‌లో 2013 నుంచి అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటివరకు 3 లక్షల మంది మరణించారు. 12 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. నిరాయుధీకరణ ఇక్కడ ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఇలాంటి ఆపరేషన్‌కు వ్యతిరేకంగా నిపుణులు పలుసార్లు హెచ్చరించారు. మెరుగైన ప్రణాళిక లేకుండా ఆయుధాలను వదులుకోమని ప్రజలను అడగలేమని వారు చెప్పారు. ఆయుధాలను వదిలివేసిన తర్వాత తమను తాము రక్షించుకోలేమని చాలా మంది భావిస్తుండటం ప్రధాన సమస్యగా తయారైంది. ఈ దీర్ఘకాల సమస్యకు ఒక పరిష్కారం వస్తే దేశంలో శాంతి నెలకొంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.

Tags :
|

Advertisement