Advertisement

  • బ్రెజిల్ లో చనిపోయిన వాలంటీర్ మా వ్యాక్సిన్ వలన కాదు .. ఆస్ట్రాజెనెకా

బ్రెజిల్ లో చనిపోయిన వాలంటీర్ మా వ్యాక్సిన్ వలన కాదు .. ఆస్ట్రాజెనెకా

By: Sankar Thu, 22 Oct 2020 7:12 PM

బ్రెజిల్ లో చనిపోయిన వాలంటీర్ మా వ్యాక్సిన్ వలన కాదు .. ఆస్ట్రాజెనెకా


కోవిడ్‌ చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ క్లినకల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురవ్వడంతో ట్రయల్స్‌‌ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పరీక్షల్లో పాల్గొన్న ఓ వలంటీర్‌ మరణించాడు. అయితే అతడు తమ వ్యాక్సిన్‌ డోస్‌ తీసుకోలేదని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

అలానే మరణించిన వ్యక్తికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేమని ఇందుకు సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్‌ ఆరోగ్య అధికారి మాట్లాడుతూ.. ‘వలంటీర్‌ మరణానికి సంబంధించిన సమాచారం సోమవారం తెలిసింది. ట్రయల్‌ భద్రత గురించి అంచనా వేసే అంతర్జాతీయ కమిటీ నుంచి పాక్షిక నివేదిక అందింది. ట్రయల్స్‌‌ కొనసాగించవచ్చని కమిటీ సూచించింది’ అని తెలిపారు.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా ప్రైవసీ, క్లినికల్‌ ట్రయల్స్‌ నిబంధనల కారణంగా వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యనించలేమని తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్‌ భద్రత గురించి జరిపిన స్వతంత్ర, కేర్‌ఫుల్‌ రివ్యూ ఎలాంటి ఆందోళన లేదని తెలియజేసింది. బ్రెజిల్‌ రెగ్యూలేటర్స్‌ ప్రయోగాలు కొనసాగించవచ్చని తెలిపినట్లు యూనివర్సిటీ సమాచార విభాగం అధిపతి స్టీఫెన్‌ రూస్‌ తెలిపారు

Tags :
|

Advertisement