Advertisement

  • కరోనా నుంచి కోలుకున్న వారికీ ఆ రాష్ట్రంలో ఇకనుంచి ఏడు రోజులే హోమ్ క్వారంటైన్

కరోనా నుంచి కోలుకున్న వారికీ ఆ రాష్ట్రంలో ఇకనుంచి ఏడు రోజులే హోమ్ క్వారంటైన్

By: Sankar Sat, 25 July 2020 4:30 PM

కరోనా నుంచి కోలుకున్న వారికీ ఆ రాష్ట్రంలో ఇకనుంచి ఏడు రోజులే హోమ్ క్వారంటైన్



కరోనా నుంచి కోలుకున్న వారికి ఓ శుభవార్త చెప్పింది అసోం ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారికి ఇకపై వారం రోజుల హోం క్వారంటైన్‌లో ఉంటే చాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇంతకుముందు పద్నాలుగు రోజులు ఉండగా ఇపుడు దీనిని ఏడు రోజులకు కుదించారు ..

అయితే డిశ్చార్జ్ అయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న రూ. రెండు వేల విలువైన అత్యవసర వస్తువుల పంపిణీ కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దారిద్ర్యరేఖకు దిగువను ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. సందర్భాన్ని బట్టి వృద్ధులకు, వికలాంగులకు, దీర్ఘరోగ వ్యాధిగ్రస్తులకూ ఈ సౌలభ్యాన్ని వర్తింపజేసేందుకు డిప్యుటీ కమిషనర్‌కు అధికారాలు ఇస్తున్నట్టు అసోం ప్రభుత్వం తెలిపింది..

తాజాగా అసోంలో ఇప్పటివరకూ 29,921 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 20,699 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లాగా.. 9,143 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో మాత్రం రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్‌ను పాటిస్తున్నాయి.

Tags :
|
|
|
|

Advertisement